– నైనాల గ్రామ మాజీ సర్పంచ్ జాగిరి యాకసాయిలు
నవతెలంగాణ-నెల్లికుదురు : మండలం లోని నైనాల గ్రామంలొ రంజాన్ పండగ సందర్భంగా ముస్లిమ్ సోదరులకు రంజాన్ మాస కానుక నూతన దుస్తులు అందించినట్లు ఆ గ్రామ మాజీ సర్పంచ్ జాగిరి యాకసాయిలు తెలిపారు. శుక్రవారం ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైన మాసమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మాసాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం వారికి ఈ నూతన వస్త్రాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు నాయిని శ్రీపాల్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు యాసం యాకయ్య , ఎన్ ఎస్ యు ఐ మండల ప్రెసిడెంట్ పెరుమాండ్ల సాగర్ గౌడ్. ఏర్పుల మహేందర్. మరియు ముస్లిమ్ సోదరులు
డా,పీర్ మహమ్మద్ . ఎండి ఇమామ్ . పాషా తదితరులు పాల్గొన్నారు.
నైనాల గ్రామంలో ముస్లిం సోదరులకు దుస్తులు అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



