నవతెలంగాణ-హైదరాబాద్: జమ్ములోని దోడా జిల్లాలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. జిల్లాలోని కహార్ గ్రామంలో మేఘవిస్ఫోటనం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. కిష్త్వార్, రాజౌరి జిల్లాల్లో అనే ఇళ్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి . ఈ విపత్తులో అనేక మంది మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఆకస్మిక వరదల కారణంగా చీనాబ్, తావి, రావి సహా పలునదులు పొంగిపొర్లుతున్నాయి. డేంజర్ మార్క్‌ను దాటి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. కథువాలో తరానా, ఉజ్, మగ్గర్ ఖాడ్, సహర్ ఖాడ్ నదులు వాటి ఉపనదుల్లో నీటి మట్టాలు పెరిగాయి. దీంతో నదీ పరివాహక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అంతేకాదు పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతన్నుయి. జమ్ములోని రాంబన్ జిల్లాలో చందర్‌కోట్, కేటామోర్, బ్యాటరీ చెష్మా వద్ద బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలను అధికారులు మూసివేశారు. జమ్ము కశ్మీర్‌లో వరద ప్రవాహానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.