నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌లో వరుస క్లౌడ్ బరస్ట్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే రెండు సార్లు క్లౌడ్ బరస్ట్‌లు జరగ్గా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇక ఇప్పుడు మరోసారి రుద్ర ప్రయాగ్, చమోలీ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ జరిగింది. దీంతో అలకనంద ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహానికి పలు ఇళ్లు కొట్టుకుపోయినట్టు సమాచారం అందుతోంది. భారీ వర్షాలకు ఇళ్లు నేల కూలడంతో శిథిలాల కింద అనేకమంది బాధితులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది.
చమోలీ జిల్లా తహసిల్ దేవల్ లోని మోపాటలో వరదల్లో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయినట్టు సమాచారం. అంతే కాకుండా కేదారి ఘాటిలోని వాలారా గ్రామంలో వంతెన కొట్టుకుపోవడంతో తీవ్రనష్టం జరిగింది. ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ఘామి ఎక్స్ వేధికగా స్పందించారు. స్థానిక అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ ప్రమాదంపై తాను నిరంతరం అధికారులతో సంప్రదిస్తున్నానని చెప్పాఆరు. కలెక్టర్, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేసినట్టు తెలిపారు. ప్రజలు క్షేమంగా బయపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.