Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఉత్తరాఖండ్‌లో గ్రామాన్ని ముంచిన‌ క్లౌడ్‌ బరస్ట్..వీడియో

ఉత్తరాఖండ్‌లో గ్రామాన్ని ముంచిన‌ క్లౌడ్‌ బరస్ట్..వీడియో

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: నైరుతి రుతుప‌వ‌నాల చురుకుద‌నంతో ఉత్త‌ర‌భార‌త్‌లోని ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని హర్సిల్ ప్రాంతానికి సమీపంలోని గంగోత్రీ పరిధిలోని ధరావలి గ్రామంలో భారీ క్లౌడ్‌ బరస్ట్ బీభ‌త్సం సృష్టించింది. ఈ ఘటనతో కొండచరియలు విరిగిపడి గ్రామంపైకి దూసుకు రావడంతో ఒక్కసారిగా ఆ ఊరు మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. ఇక, కొండచరియల కింద పలువురు గ్రామస్థులు చిక్కుకున్నట్లు టాక్. ఈ ఘటనపై ఉత్తరకాశీ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్ ఆర్య అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా గ్రామంలో భారీ నష్టం జరిగింది. దీని వల్ల పలు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు. అప్రమత్తమైన రెస్క్యూ టీమ్స్ హెలికాప్టర్లు, స్థానిక వనరులతో సహాయక చర్యలు చేపట్టారు. కొండచరియల కింద చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad