నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరాఖండ్‌ను మళ్లీ భారీ వరదలు చుట్టుముట్టాయి. తాజాగా చమోలీ జిల్లాలో థరలీలో కురిసిన భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. ఫలితంగా అనేక నివాస ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. లెక్కలేనన్ని వాహనాలు బురదలో కూరుకుపోయాయి. విద్యాసంస్థలను మూసివేశారు. వరదలు కారణంగా పలువురు గల్లంతైనట్లు సమాచారం.
అయితే ఆగస్టు 22 నుంచి 25 వరకు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పిథోరగఢ్, బాగేశ్వర్ జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. భారత వాతావరణ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం అతి స్వల్ప సమయంలో భారీ వర్షాలకు దారి తీయడాన్నే క్లౌడ్ బరస్ట్ అని అంటారు.
