నవతెలంగాణ-హైదరాబాద్ : సింహాచలం ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. సింహాచలంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రమాద ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం కలచి వేసిందని అన్నారు. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అక్కడి పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడానని తెలిపారు. ఇక గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాను అని సీఎం రాసుకొచ్చారు.
సింహాచలం ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి
- Advertisement -
RELATED ARTICLES