నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. వైరల్ జ్వరంతో బాధపడుతున్న పవన్‌ను ఆయన హైదరాబాద్‌లోని నివాసంలో ఆదివారం మధ్యాహ్నం కలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం జ్వరం తీవ్రత తగ్గిందని, అయితే ఎడతెరిపి లేకుండా వస్తున్న దగ్గు ఇబ్బంది పెడుతోందని పవన్ ముఖ్యమంత్రికి వివరించారు. వైద్య పరీక్షల అనంతరం, దీర్ఘకాలిక బ్రాంకైటిస్ కారణంగానే దగ్గు, గొంతు నొప్పి వస్తున్నట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు… పవన్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.