నవతెలంగాణ-హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సోమవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా సిఎం మాట్లాడుతూ … తగ్గించే ప్రతి కట్టకు రూ.800 నేరుగా రైతుకు అందిస్తామని చెప్పారు. రైతు నష్టపోకూడదు, ప్రజారోగ్యం బాగుండాలని అన్నారు. ” యూరియా ఎక్కువ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది. దీని వాడకంపై రైతుల్లో చైతన్యం తీసుకురావాలి. ఏపీలో క్యాన్సర్ టాప్-5 రోగాల జాబితాలో ఉంది. వాడకం ఇలాగే కొనసాగితే క్యాన్సర్‌లో నంబర్-1 కి వెళ్లిపోతాం. వచ్చే ఏడాది నుంచి ఎంతవరకు అవసరమో అంతే వినియోగించాలి. మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ కింద ఇవ్వాలి. యూరియా ఎక్కువ వాడితే ఎక్కువ పంట వస్తుందనుకోవడం సరికాదు. దీని అతివాడకంపై పంజాబ్‌ను కేస్ స్టడీగా చూడాలి ” అని చంద్రబాబు అన్నారు.
ఏపీ రైతులకు సీఎం చంద్రబాబు కీలక ఆఫర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES