Thursday, January 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దర్పల్లిలో ప్రారంభమైన సీఎం కప్ క్రీడలు

దర్పల్లిలో ప్రారంభమైన సీఎం కప్ క్రీడలు

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
మండల కేంద్రములోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం సీఎం కప్ క్రీడలు అట్ట హాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఎంపిడిఓ లక్ష్మారెడ్డి, తహసీల్దార్ శాంత, గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్, ఆర్మూర్ చిన్న బాలరాజ్ లు పాల్గొని క్రీడలను జ్యోతి  ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభ వెలికి తీసేందుకు ప్రభుత్వం ఈ ఆటల పోటీలను నిర్వహించడం జరిగిందని అన్నారు.

కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు మూడు రోజులపాటు కొనసాగానున్నాయని తెలిపారు. కార్యక్రమాన్ని మొదటగా వాలీబాల్ పోటీలను సర్పంచ్ శ్రీనివాస్ బాలింగ్ వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమములో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఇంద్రనగర్ తండా సర్పంచ్ బాలు నాయక్, పోటిల్లో పాల్గొనే విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -