Monday, April 6, 2026
E-PAPER
Homeఆదిలాబాద్కాఫీ టేబుల్ బుక్ ను ఆవిష్కరించిన సిఎం

కాఫీ టేబుల్ బుక్ ను ఆవిష్కరించిన సిఎం

- Advertisement -

నవతెలంగాణ-ముధోల్ : జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ‘కాఫీ టేబుల్ బుక్’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  బాసర లో సోమవారం ఆవిష్కరించారు. ఇందులోని అంశాలను కలెక్టర్  అభిలాష అభినవ్ వివరిస్తూ ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులకు నిర్మల్‌లో  ప్రసిద్ధిగాంచిన కొయ్య బొమ్మలు, పెయింటింగ్స్‌ను జ్ఞాపికలుగా కలెక్టర్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు సుదర్శన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు పవార్ రామారావు పటేల్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వెడ్మ బొజ్జు పటేల్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, నిర్మల్, బైంసా మున్సిపల్ చైర్మన్లు అప్పాల కావ్య, దత్తాత్రి, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయరామారావు, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -