Monday, April 6, 2026
E-PAPER
Homeఆదిలాబాద్బాసర ఆలయ పున నిర్మాణానికి సీఎం భూమి పూజ...

బాసర ఆలయ పున నిర్మాణానికి సీఎం భూమి పూజ…

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్: బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణం  పనులకు సీఎం రేవంత్ రెడ్డి  సోమవారం భూమి పూజ చేశారు. హైదరాబాదు నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో బాసరకు చేరుకున్నారు. అనంతరం అమ్మవారు ఆలయంలో మనమడి అక్షరాభ్యాసం పూర్తి అయిన తర్వాత, ఆలయ పునర్నిర్మాణం కోసం మంజూరు చేసిన 225 కోట్ల రూపాయల పనులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి భూమి పూజ చేశారు. అలాగే ముధోల్ కు 200 కోట్లరుపాయలతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, కాంప్లెక్స్కు అక్కడే శంకుస్థాపన చేశారు. ఆలయ పూజారుల వేదమంత్రోచరణల మధ్య ఆలయ పునర్ నిర్మాణ పనులను సీఎం ప్రారంభించారు.

ముందుగా గడ్డ పారతో తవ్వి, ఇసుక, సిమెంట్ మిశ్రమాన్ని వేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి  కొండా సురేఖ, జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపి గొడం నగేష్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ కొమరయ్య, దండె విఠల్ , ఎమ్మెల్యే లు రామారావు పటేల్, బొజ్జు పటేల్, మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు, నారాయణరావు పటేల్, విట్టల్ రెడ్డి, రేఖ శ్యామ్ నాయక్, స్థానిక సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -