నవతెలంగాణ-హైదరాబాద్: పాక్- భారత్ మధ్య ఉద్రిక్తత వేళ..ఉగ్రవాదుల స్థావరాలపై ఇండియా ఆర్మీ దాడులు చేయగా.. సాధారణ ప్రజల నివాసాలే లక్ష్యంగా పాక్ ఆర్మీ బుల్లెట్లు వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ లో పదుల సంఖ్యలో జనావాసాలు ధ్వంసమైయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఆయా ప్రాంతాల్లో సీఎం ఓమర్ అబ్ధులా, లెప్టనెంట్ మనోజో సిన్హా పర్యటించారు. పాక్ కాల్పుల్లో ధ్వంసమైన ఇండ్లను పరిశీలించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బాధితులతో మాట్లాడి వారి సాధకబాధలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా పాక్ కాల్పుల్లో గాయపడిన బాధితుల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆధికారలుకు సూచించారు. మే7న ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న వేళ జమ్మూలోని పలు సరిహద్దు ప్రాంతాల్లో ఆయన పర్యటించిన విషయం తెలిసిందే.
పూంచ్‌లో సీఎం, ఎల్జీల పర్యటన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES