నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్‌పై డ్రోన్ దాడులు, కాల్పులతో పాక్ తిరగబడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ దాడిలో దెబ్బతిన్న ఇళ్లను జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా శనివారం సందర్శించారు. గత రెండు రోజుల నుంచే సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను జమ్మూ ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ప్రజలకు షెల్టర్లతో పాటు, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు ఏకంగా సీఎం రంగంలోకి దిగారు. స్థానికులతో చర్చిస్తూ వారికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశిస్తున్నారు. మరోవైపు నిన్న పాక్ జరిపిన కాల్పుల్లో జమ్ముకాశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్‌కుమార్ థప్పా ప్రాణాలు కోల్పోయారు. రాజౌరీ పట్టణంలో ఉంటున్న ఆయన ఇంటిపై పాక్ ఫిరంగులు పడటంతో ఆయన మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం ఒమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
జమ్మూలో సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యటన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES