Friday, May 9, 2025
Homeసినిమా'సీఎం పెళ్లాం' రొటీన్‌ సినిమా కాదు

‘సీఎం పెళ్లాం’ రొటీన్‌ సినిమా కాదు

- Advertisement -

ఇంద్రజ, అజరు జంటగా నటించిన చిత్రం ‘సీఎం పెళ్లాం’. బొల్లా రామకృష్ణా రెడ్డి (బీఆర్‌కే) నిర్మించిన ఈ చిత్రానికి గడ్డం రమణారెడ్డి దర్శకుడు. ఈ సినిమా నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రమణారెడ్డి మాట్లాడుతూ, ‘ఎమ్మెల్యే.. సీఎం అవుతాడు. ఎలక్షన్లు రాగానే ఎమ్మెల్యేగా కంటెస్ట్‌ చేసే వ్యక్తే కాకుండా ఆయన సతీమణి ఓట్లు అడగడం తెలిసిందే. కానీ గెలిచాక ఎంతమంది తమ ఇంటికి వచ్చిన ఓటర్లను కలుస్తున్నారు? అనే దాన్ని ఈ సినిమా ద్వారా నేను అడుగు తున్నా. కనీసం ఈ సినిమా తర్వాత అయినా అది ప్రారంభమవుతుందని ఆశిస్తున్నా. ఎమ్మెల్యే కాస్త బిజీగా ఉండి బయట తిరుగుతున్న సమయంలో ఇంటికి పెద్ద సంఖ్యలో తమ సమస్యల పరిష్కారానికి వచ్చిన వ్యక్తులను ఎమ్మెల్యే పెళ్లాం ఒక రెండు లేదంటే మూడు గంటల పాటు కలిస్తే చాలా మార్పులొస్తాయని నమ్మాను. ఏదో చేయాల్సిన అవసరం లేదు కానీ కలిస్తే చాలు మార్పొస్తుందని, యంగ్‌స్టర్స్‌ గురించి కూడా ఈ సినిమాలో చూపించాను. అలాగే ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో వైరస్‌ వ్యాధి కన్నా మించింది బూతు. రాజకీయ నాయకులు మీడియా ముందుకు వచ్చి బూతులు మాట్లాడితే రాజకీయాల్లో ఐదేళ్ల పాటు పోటీ చేయకుండా నిషేధం విధించాలనే రూల్‌ తీసుకురావాలని కోరబోతున్నా. అలాగే పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే.. పవర్‌ కోల్పోతారన్న రూల్‌ రావాలి. కాబట్టి ఇది రొటీన్‌ సినిమా కాదు. ఎంటర్‌టైన్‌మెంట్‌ యాంగిల్‌లో ఒక మెసేజ్‌ ఇవ్వబోతున్నా’ అని అన్నారు.
‘బూతులు మాట్లాడితేనే గొప్ప అనుకునే రాజకీయ నాయకుల నుంచి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో సినిమా చేశాం. ఈ సినిమా చూశాక ప్రజల్లో మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నా’ ప్రొడ్యూసర్‌ రామకష్ణ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -