నవతెలంగాణ- నెల్లికుదురు
మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు పోరిక బలరాం నాయక్ సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేసినట్లు రాజ్య తండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇస్రావత్ సుందర్ నాయక్ తెలిపారు. బుధవారం గ్రామానికి చెందిన బానోతు వీరన్నకు చెక్కును అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామానికి చెందిన బానోతు వీరన్న అనారోగ్యంతో బాధపడతు దావఖానాలో వేల రూపాయలు ఖర్చుపెట్టి ఆర్థికంగా ఆర్థికంగా నష్టపోయాడని అన్నారు. అలా నష్టపోకుండా ఉండేందుకు ఎంపీ బలరామ నాయక సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నాడని అతనికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించడం జరిగినది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలు అభివృద్ధి చెందేందుకు అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి గడపగడపకు చేరే విధంగా కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



