- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ఎఫెక్ట్ ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగే 72వ మిస్ వరల్డ్ పోటీలపై పడింది. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ఇవాళ్టి నుంచి ఈ పోటీలు ప్రారంభం కానుండగా… ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోటీలకు తరలివచ్చిన అతిథులకు ఇవ్వాల్సిన డిన్నర్ పార్టీని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు.
- Advertisement -