- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఏపీలోని గుంటూరుకు వెళ్లనున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూతురు వివాహానికి హాజరుకానున్నారు. హెలికాప్టర్ ద్వారా బేగంపేట నుండి గన్నవరం చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో వివాహ వేడుకకువ వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం. ఈ పర్యటన తర్వత సీఎం రేవంత్ హైదరాబాద్ చేరుకొని అసెంబ్లీ సమావేశాలకు హాజరవనున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -



