Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకొత్త మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..

కొత్త మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నూతన మంత్రులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషెస్ తెలియజేశారు. నూతన మంత్రులుగా వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా, శాసనసభ ఉపసభాపతి (డిప్యూటీ స్పీకర్)గా రామచంద్రు నాయక్ నియమితులయ్యారు. దీనిపై రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. “నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న వివేక్ వెంకట స్వామి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, వాకిటి శ్రీహరి గారికి నా అభినందనలు. శాసనసభలో ఉప సభాపతి బాధ్యతలు స్వీకరించబోతున్న రామచంద్రు నాయక్ గారికి నా అభినందనలు…” అని పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad