Saturday, March 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ కీలక ప్రకటన..

జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ కీలక ప్రకటన..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ సాధణలో తొలి, మలిదశ ఉద్యమాల్లో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర కీలకం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నల్లబంగారాన్ని వెలికి తీస్తున్న సింగరేణి కార్మికులు దేశానికి ఆదర్శం అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు గొప్ప చరిత్ర ఉంది. భూపాలపల్లి కుగ్రామంగా ఉన్న సమయంలో అన్న నందమూరి తారకరామరావు మొట్టమొదట దీన్ని మండల కేంద్రంగా మార్చి సింగరేణి బొగ్గు ఉత్పత్తికి మొట్టమొదటి పునాది రాయి వేశారు. దాంతో ఆ తర్వాత భూపాలపల్లి వెనక్కి తిరిగి చూడలేదు. ఇప్పుడు భూపాలపల్లి జిల్లా కేంద్రంగా, మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది. దీనికి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి అన్నారు. భూపాలపల్లి జిల్లాను కాంగ్రెస్ పార్టీ రద్దు చేయబోతోందని ఇటీవల కొంతమంది విషపు ప్రచారం చేస్తున్నారు. ఈ వేదిక నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు చెబుతున్నాను. ఏ జిల్లాను తొలగించడం, కొత్త జిల్లాను ఇచ్చే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు. ఎప్పుడైనా జిల్లాల పునర్విభజనపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి, శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచన తీసుకున్న తర్వాతే జిల్లాలపై ఆలోచన చేస్తామన్నారు. ఎవరి ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అపోహాలు సృష్టించాలని ప్రయత్నాలు చేసినా భూపలపల్లి జిల్లా ఎక్కడికి పోదన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్‍లో ఆదివారం ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ‘ప్రజాపాలన-ప్రగతి బాట’ సభలో పాల్గొని మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -