- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం రేవంత్ ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం బెండాలపాడు గ్రామంలో ‘ఇందిరమ్మ ఇళ్ల’ గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున, గిరిజన నియోజకవర్గాలు, ఐటీడీఏ ప్రాంతాలకు అదనంగా 1000 చొప్పున ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తోంది.
- Advertisement -