- Advertisement -
- జననేత..మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి.
నవతెలంగాణ-ఊరుకొండ: బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేదల పాలిట వరాలు అని జననేత.. జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి అన్నారు. సోమవారం ఊరుకొండ మండల పరిధిలోని జకినాలపల్లి గ్రామానికి చెందిన గుండ్లపల్లి లక్ష్మమ్మశ్రీను కుటుంబానికి 20వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును మాజీ సర్పంచ్ అనిల్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు, ఈ సహకారానికి అండగా నిలిచిన జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డికి మరియు జడ్చర్ల శాసన సభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డికి గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి, చిన్న వెంకటయ్య, నర్సింహరెడ్డి, పోలే లింగమయ్య, వార్డు నెంబర్ నరేందర్ రెడ్డి, మహేష్, రాంగోపాల్ రెడ్డి, కిషోర్, మహేష్, సందీప్ రెడ్డి, మహేష్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



