Friday, June 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం చెక్కు అందజేత

సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం చెక్కు అందజేత

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని రాజరాజేశ్వరీ నగర్ గ్రామానికి చెందిన సరిగేల సాయిలుకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కును కాంగ్రెస్ నాయకులు అందజేశారు. అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రులలో వైద్యం చేయించుకున్న లబ్ధిదారుడు ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన కృషితో లబ్ధిదారుడు సరిగేల సాయిలుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.60వేల ఆర్థిక సహాయం చెక్కును మంజూరు చేసింది.అట్టి చెక్కును గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక గ్రామపంచాయతీ వద్ద లబ్ధిదారుడికి అందజేశారు.ఆర్థిక సహాయం చెక్కు మంజూరుకు కృషి చేసిన రాష్ట్ర కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డికి  లబ్ధిదారుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐలాపురం నర్సయ్య, శంకర్, నటరాజ్, దేవరాజం, నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -