నవతెలంగాణ -ముధోల్ : బాసర పర్యటన కు సోమవారం వచ్చిన సిఎం రెవంత్ రెడ్డి కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. గత మూడు రోజులుగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల బాసర ను పలుమార్లు సందర్శించి పగడ్బందీ చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా బాసర సిఎం వస్తే విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు,ఆశ కార్యకర్తల తో పాటు పలువురితో నిరసన వ్యక్తం అవుతుందన్నా ప్రచార నేపద్యం లో పోలిసులు పకడ్బందీ గా బందోబస్తు ఏర్పాటు చెప్పట్టారు.జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో సిఎం పర్యటనకు మూడంచెల భద్రత ను ఏర్పాటు చేసీ , సిఎం పర్యటనను విజయవంతం చేశారు. ముందుగానే ఆశా కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. సిఎం పర్యటన లో ఏక్కడ నిరసన వ్యక్తం కాకుండా పోలీసుల చర్యలు ఫలించాయి. ఎస్పీ బాసర పై ప్రత్యేక నిఘా ఉంచటంతో ఎలాంటి నిరసన కార్యక్రమంలు తలెత్తలేదు. ఏది ఏమైనా జిల్లా కలెక్టర్, ఎస్పీ కృషి తో సిఎం పర్యటన విజయవంతం అయిందని పలువురు పేర్కొంటున్నారు .ఈ సందర్భంగా సిఎం పర్యటన ను విజయవంతం కు సహకరించిన వివిధ శాఖల అధికారులకు ,ప్రజాప్రతినిదులకు, పోలిస్ సిబ్బంది,బాసర గ్రామస్తులకు కలెక్టర్ అభిలాష అభినవ్ కృతజ్ఞతలు తెలిపారు.



