Sunday, January 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకోల్‌ మైనింగ్‌ టెండర్లు అనుభవం ఉన్నవారికే: సీఎం రేవంత్‌రెడ్డి

కోల్‌ మైనింగ్‌ టెండర్లు అనుభవం ఉన్నవారికే: సీఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సింగరేణి టెండర్లలో తమ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదని, కోల్‌ మైనింగ్‌ టెండర్లు అనుభవం ఉన్నవారికే ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఖ‌మ్మం జిల్లా మద్దులపల్లి సభలో ఆయన మాట్లాడుతూ… తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.

‘‘మీకు మీకు ఉన్న పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు. మా మంత్రులను బద్నాం చేసే ప్రయత్నం చేయొద్దు. ఇలాంటి కథనాల రాసే ముందు మమ్మల్ని వివరణ అడగాలి. మంత్రులపై అవాకులు చవాకులు పేలుతున్నారు. సింగరేణిలో బొగ్గంతా మాయమైందని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. తప్పుడు ‍ప్రచారాలతో అపోహలు సృష్టించొద్దు. మీడియాకు వివరాలు ఇచ్చేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటాను’’ అని రేవంత్‌ చెప్పుకొచ్చారు.

‘‘మా ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదు. 100 రోజుల్లో సమ్మక్క,సారక్క పనులు పూర్తి చేశాం. గత ముఖ్యమంత్రి ఏకపాత్రాభినయం చేశాడు. మేమందరం సమన్వయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. కోల్ మైనింగ్ టెండర్‌లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఖమ్మం జిల్లాలో 1130 గ్రామపంచాయతీలు ఉంటే 790 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలి’’ అని రేవంత్‌ పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -