Thursday, July 17, 2025
E-PAPER
Homeఖమ్మంమావోలకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవు 

మావోలకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవు 

- Advertisement -

– సీఐ రవీందర్ హెచ్చరిక 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి (గుండాల) : మావోయిస్టులకు సహాయ, సహకారాలు అందిస్తే, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గుండాల పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్సై ఎల్.రవీందర్, సైదా రౌఫ్ హెచ్చరించారు. బుధవారం వారు మండలంలోని శెట్టుపల్లి, కోటగడ్డ, సజ్జలబోడు, చింతలపాడు గ్రామాలలో ప్రజలతో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మండలంలో ఎవరైన అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. నిషేధిత మావోయిస్టులకు సహాయ, సహకారాలు అందించి కేసులకు గురికావద్దని హెచ్చరించారు. మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలను నమ్ముకుని, తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. జన జీవన స్రవంతిలో కలిస్తే పోలీస్ శాఖ నుంచి ఆపరేషన్ చేయూత ద్వారా ప్రభుత్వం నుండి సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. దాంతో తమ మిగతా జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించవచ్చని తెలిపారు. మావోయిస్టుల మాయమాటలు నమ్మి నిండు జీవితాలను బలి తీసుకోవద్దని యువతకు హితవు పలికారు. అమాయక ప్రజలను టార్గెట్ చేసి మావోయిస్టులు తమ ఊబిలోకి లాగి, వారి స్వలాభం కోసం అమాయకులను బలిగొంటున్నారని చెప్పారు. నిరుద్యోగులకు పోలీస్ శాఖ నుంచి చేయూత అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం శెట్టుపల్లి గ్రామ యువతకు వాలీబాల్ కిట్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కొమరారం పోలీస్ స్టేషన్ ఎస్సై నాగూల్ మీరా, సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -