Tuesday, September 30, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకూలిన పాఠశాల భవనం..శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

కూలిన పాఠశాల భవనం..శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇండోనేసియాలో నిర్మాణంలో ఉన్న ఓ పాఠశాల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 65 మంది విద్యార్థులు శిథిలాల్లో చిక్కుకున్నారు. అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. జావాలోని సిడోర్జో పట్టణంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల ఇస్లామిక్ పాఠశాల భవనం సోమవారం కుప్పకూలింది. సోమవారం మధ్యాహ్న సమయంలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాఠశాల భవనంలో ప్రార్థనల కోసం గుమిగూడారు. అదే సమయంలో భవనం కూలిపోవడంతో స్థానికులు 79 మంది విద్యార్థులను కాపాడారు. ఇంకా దాదాపు 65 మంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. విద్యార్థులంతా 12 నుంచి 17 ఏళ్లలోపు ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనా స్థలంలో విద్యార్థుల కుటుంబాల రోదనలు మిన్నంటాయి.

సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. శిథిలాలలో చిక్కుకొన్న విద్యార్థుల సంఖ్యను నిర్ధరించడానికి పోలీసులు పాఠశాల అధికారుల సాయం తీసుకుంటున్నట్లు సమాచారం. మూడు అంతస్తుల భవనంపై నాలుగో అంతస్తును నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీని నిర్మాణానికి మూడో అంతస్తులో భారీగా కాంక్రీటు వేయడంతో భవనం కూలిపోయి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. రెండు అంతస్తుల్లో తరగతులు నిర్వహిస్తుండగా.. కింది అంతస్తును ప్రార్థనా మందిరంగా వాడుతున్నట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -