Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏటీసీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

ఏటీసీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

- Advertisement -

– బషీరాబాద్ ఏటీసీ కేంద్రంలో సదుపాయాల పరిశీలన
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని బషీరాబాద్ లో గల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో ఇటీవల నూతనంగా ప్రారంభించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటిసి) ను జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలకు  అనుసంధానంగా నూతనంగా నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)ను సందర్శించిన ఆయన ఈ కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఏటిసి పనుల పురోగతిని పర్యవేక్షించిన ఆయన  ఫర్నిచర్సివిల్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్, మిషనరీ ఇన్స్టాలేషన్, ఫర్నిచర్, విద్యార్థుల శిక్షణ తరగతులు, మాస్టర్ ట్రైనర్స్, అవసరం ఉన్న మౌలిక వసతుల గురించి ఐటిఐ ప్రిన్సిపల్ కోటిరెడ్డి, నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆయా కోర్సులలో పూర్తి స్థాయిలో అభ్యర్థులు ప్రవేశాలు పొందేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. కాగా విద్యార్థుల రవాణా సౌకర్యం, హాస్టల్ వసతి గురించి ప్రిన్సిపల్ కోటిరెడ్డి కలెక్టర్ కు విన్నవించారు.కలెక్టర్ వెంట స్థానిక అధికారులు తహసిల్దార్ గుడిమేల ప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజా శ్రీనివాస్, మండల రెవెన్యూ అధికారి శరత్, టీజీఐఐసి జోనల్ మేనేజర్ ఎం.శివప్రసాద్, ఐటిఐ సిబ్బంది తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -