నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పాసైన ప్రతి విద్యార్థి కి కలెక్టర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలంలోని కంకణాల గూడెం ( షెరిగూడం ) కలెక్టర్ దత్తత తీసుకున్న విషయం విదితమే. సదరు విద్యార్థి 10వ తరగతిలో 73% మార్కులతో ప్రధమ స్థానంలో ఉత్తీర్ణత సాధించడంతో కలెక్టర్ భరత్ చంద్ర చారి కి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఫోన్ ద్వారా భరత్ చంద్ర చారి తో మాట్లాడారు. అన్న మాట నిలబెట్టుకున్నావు అని, మీ ఇంటికి వస్తా, వచ్చి నీకు సన్మానం చేస్తా అన్నారు. పదవ తరగతి అనేది విద్యార్థికి మైలు రాయి లాంటిది అనేది భారత్ చంద్ర చారి నిరూపించారన్నారు.ఈ విజయ సాధనలో పాలుపంచుకున్న భరత్ చంద్ర తల్లి విజయలక్ష్మి కి కూడా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భరత్ చంద్ర చారి స్పందిస్తూ నన్ను కష్టపడి చదివేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న మా అమ్మకి , గురువులకు, ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో ఇంచార్జీ జిల్లా విద్యా శాఖ అధికారి ప్రశాంత్ రెడ్డిని 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు సన్మానించి అభినందనలు తెలిపారు. జిల్లాలో మొత్తం 8,622 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు వ్రాయగా 8,432 మంది ఉత్తీర్ణత సాధించి 97.80% శాతం నమోదయ్యారన్నారు. గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల సాధనలో జిల్లా 25వ స్థానంలో ఉండగా ఈ ఏడాది రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచామని, జిల్లాకే గర్వకారణంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఇదే స్ఫూర్తి తో మరింత పట్టుదలతో విద్యార్థులందరు కష్టపడి చదివి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు.
పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్..
- Advertisement -
RELATED ARTICLES