నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ లో మీడియా సెంటర్ ను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లో మీడియా సెంటర్ ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలసి జిల్లా ప్రారంభించినట్లు, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు లో భాగంగా మీడియా సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారం పై మీడియా సెంటర్ ద్వారా నిఘా పెట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
అనంతరం పత్రిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతగా 6 మండలాల్లో 153 గ్రామ సర్పంచులు 1286 వార్డులు నెంబర్ల లకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మొత్తం మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని అందుకు సంబంధించిన ఏర్పాటు కూడా పూర్తి చేశామని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయితీ రిటర్నింగ్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, నామినేషన్ వేసే సమయంలో ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని తెలిపారు.నామినేషన్ వేసే అభ్యర్థి కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలని వారి ఎన్నికల ఖర్చు మొత్తం ఆ ఖాతా నుండి జరపాలని సూచించారు. ఇప్పటికే జిల్లాలో మొదటి విడత ఎన్నికల విధుల్లో పాల్గొని ఆర్వోలకు, ఏఆర్వోలకు, సిబ్బందికి శిక్షణ తరగతులు పూర్తి అయ్యాయని తెలిపారు. రెండో విడతలో పాల్గొని వారికి ఈరోజు నుండి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు . గ్రామాల్లోని ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా వారందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు .జిల్లాలోని ప్రజలందరూ కూడా ఎన్నికల కోడ్ లోని నియమ నిబంధనలు పాటించాలన్నారు .రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం జిల్లాలో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.సర్పంచ్ , వార్డు సభ్యుల పదవులను వేలం ద్వారా దక్కించుకోవాలని చూసిన , ప్రయత్నించిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



