Wednesday, December 10, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
మంచిర్యాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జన్నారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. అధికారుల నుంచి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు ఇబ్బందులు కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. జిల్లా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -