Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీబీపేట్ బ్రిడ్జికి చేపట్టిన పునరుద్దరణ పనులను పరిశీలించిన కలెక్టర్ 

బీబీపేట్ బ్రిడ్జికి చేపట్టిన పునరుద్దరణ పనులను పరిశీలించిన కలెక్టర్ 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి :  జిల్లా ఆశీష్ సాంగ్వాన్, ఆర్ , బి ఇఇ మోహన్ తో కలిసి సోమవారం బీబీపేట మండలంలో పర్యటించి  అధిక వర్షాలతో దెబ్బతిన్న బీబీపేట్ బ్రిడ్జికి చేపట్టిన పునరుద్దరణ పనులను పరిశీలించారు.  ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బీబీపేట్ నుండి  సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకను అనుసంధానించే ముఖ్యమైన వంతెన ఇదని వంతెన పునరుద్దరణ కోసం నిధుల కొరత లేదని అధికారులు వంతెన పునరుద్దరణ పనులపై మొత్తం దృష్టిపెట్టి యుద్ధప్రాతిపదికన వంతెన పునరుద్దరణ పనులు నిర్వహించి బీబీపేట్ వంతెనను ప్రజల రవాణా కొరకు ఉపయోగంలోకి తీసుకు రావాలని ఆర్, బి ఇఇ మోహన్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -