Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్ఎడ్ బిడ్ రోడ్డుపై కలెక్టర్ సీరియస్…

ఎడ్ బిడ్ రోడ్డుపై కలెక్టర్ సీరియస్…

- Advertisement -
  • – క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం..!           
    నవతెలంగాణ -ముధోల్
     ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరు అయిన సిసి రోడ్డు వేయకుండా బిల్లు మంజూరు చేయడం పై నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సీరియస్ అయ్యారు. సి సి రోడ్డు వ్వవహారం గురువారం బయటకు మీడియా ద్వారా పోక్కటంతో కలెక్టర్ ఇప్పటికే పంచాయతీ రాజ్ ఏఈ సురేందర్ పై సస్పెన్షన్ వేటు వేశారు. పనిచేయకుండా బిల్లు చేయటంలో హస్తమున్న బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. తాజాగా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం రాత్రి పనిచేయుకున్న సిసి రోడ్ బిల్లు మంజూరు చేసిన  సంఘటనపై చర్యలు తీసుకోవాలని ముధోల్ తహశీల్దార్ శ్రీలత ముధోల్ పోలిస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నిధులను దుర్వినియోగానికి పాల్పడిన బాధ్యులు అయిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఈ విషయం పై ఎస్ఐ బిట్ల పెర్సిస్ ను  నవతెలంగాణ శుక్రవారం ఉదయం వివరణ కోరగా ఎడ్ బిడ్ సిసి రోడ్డు  వ్వవహారం లో బాధ్యులు అయిన వారిపై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ పిర్యాదు చేశారని తెలిపారు. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad