Thursday, January 8, 2026
E-PAPER
Homeకరీంనగర్నవతెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్

నవతెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ప్రజా సమస్యలను నిర్భయంగా, నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకువస్తూ నవ తెలంగాణ పత్రిక విశ్వసనీయతను చాటుకుంటుందని జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. నవతెలంగాణ క్యాలెండర్ ను ఆమె ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికల పాత్ర కీలకమని సామాజిక బాధ్యతతో వార్తలను అందించడంలో నవతెలంగాణ ముందుండటం అభినందనీయమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విషయాలను ప్రజలకు చేరవేయడంలో నవ తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సామాజిక  స్పృహ పెంపొందించే వార్తలు ప్రజాప్రయోజన అంశాలతో నవతెలంగాణ ముందుంటుందని ఆమె పేర్కొన్నారు. ప్రజా సమస్యలను బాధ్యతాయుతంగా ప్రతిబింబిస్తూ సామాజిక బాధ్యతను నిర్వర్తి స్తున్న నవ తెలంగాణ పత్రికను కలెక్టర్ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -