నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో ఆవిర్భవించిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మీడియా అకాడమీ మాజీ చైర్మన్, టీజేఎఫ్ వ్యవస్థాపకులు అల్లం నారాయణ ఆధ్వర్యంలో ఈ నెల 31న హైదరాబాద్ జలవిహార్ లో నిర్వహిస్తున్న రజతోత్సవ సభనకు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలిరావాలని టియూడబ్ల్యూజే (హెచ్ 143) రాష్ట్ర ఉపాధ్యక్షులు గొట్టిపర్తి భాస్కర్ గౌడ్, జిల్లా అధ్యక్షులు జూకంటి అనిల్, జిల్లా ప్రధాన కార్యదర్శి దుడుక రామకృష్ణ లు పిలుపునిచ్చారు.
తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో ఆనాటి సీనియర్ పాత్రికేయులు అల్లం నారాయణ నాయకత్వంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పాటు చేసుకొని జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ఆనాడు ఏర్పడిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం 25వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అల్లం నారాయణ నాయకత్వంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ సభను హైదరాబాద్ జల విహార్ ఆడిటోరియంలో 31 మే 2025న ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నారని, ఈ సభను విజయవంతం చేయడానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టులు కదలి రావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జాతీయ కమిటీ సభ్యులు కందుల శ్రీనివాస్, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గంధ మల్ల రాజు, ఆసంఘం రాష్ట్ర నాయకులు మహమ్మద్ ఖాజా, నీల కిరణ్, బూడిద శ్రీహరి, కేతావత్ తిరుపతి నాయక్, జిల్లా నాయకులు హమీద్ పాషా, గడ్డమీది చంద్రం గౌడ్, జి సంజీవరావు, నర్సింగరావు, కన్నే కంటి శ్రీనివాసచారి, భువనగిరి మండల అధ్యక్షుడు కురిమిండ్ల రాజు గౌడ్, బోయిన మల్లేశం, పిన్నింటి బలరాంరెడ్డి, దండు కృష్ణ, సురుపంగ కుమారస్వామి, ఆలేరు మండల అధ్యక్షుడు గుండు మహేందర్, చెన్రాజు శేఖర్, పిట్టల రమేష్, బూడిద రిషికేష్, చుక్క స్వామి లు పాల్గొన్నారు.