Friday, September 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహాస్య నటుడు రోబో శంకర్ కన్నుమూత

హాస్య నటుడు రోబో శంకర్ కన్నుమూత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తమిళ హాస్య నటుడు రోబో శంకర్‌ (46) కన్నుమూశారు. రెండో రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చెన్నైలో మంగళవారం ఓ సినిమా చిత్రీకరణ సమయంలో స్పృహతప్పి పడిపోవడంతో శంకర్‌ను ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించి గురువారం రాత్రి మరణించారు. సినిమాల్లోకి రాకముందు ఓ ప్రైవేటు టీవీ ఛానెల్‌లో మిమిక్రీ కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. రోబో తరహాలో నృత్యం చేయడం ద్వారా రోబో శంకర్‌గా గుర్తింపు పొందారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. విశ్వాసం, పులి, సింగం 3, కోబ్రా తదితర చిత్రాల్లో నటించారు. కామెర్ల సంబంధ వ్యాధితో శంకర్‌ బాధపడుతున్నట్లు సమాచారం. శంకర్‌ మృతికి నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ తదితరులు సంతాపం ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -