- Advertisement -
నవతెలంగాణ – ఢిల్లీ: కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్‌షా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి క్షమాపణలను అంగీకరించలేమని చెప్పింది. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలని.. బాధ్యతగా ఉండాలని తెలిపింది. మరోవైపు ఈ వ్యాఖ్యలపై విచారణకు మధ్యప్రదేశ్‌కు చెందని ఐపీఎస్‌లతో సిట్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లతో దీన్ని ఏర్పాటు చేయాలని.. అందులో ఒక మహిళ ఉండాలని పేర్కొంది. ఈ నెల 28 లోగా నివేదిక అందజేయాలని సిట్‌ను ఆదేశించింది.
- Advertisement -