Tuesday, January 13, 2026
E-PAPER
Homeఖమ్మంముసాయిదాపై పార్టీ ప్రతినిధులతో కమిషనర్ భేటీ

ముసాయిదాపై పార్టీ ప్రతినిధులతో కమిషనర్ భేటీ

- Advertisement -

నవతెలంగాణ-అశ్వారావుపేట: అశ్వారావుపేట మున్సిపాల్టీలో 22 వార్డులకు గాను 35 పోలింగ్ కేంద్రాలుతో రూపొందించిన ముసాయిదా పై పార్టీ ప్రతినిధులతో కమీషనర్ నాగరాజు మంగళవారం సమావేశం నిర్వహించారు. తెలంగాణ రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో పురపాలక కమిషనర్ బి.నాగరాజు అద్యక్షతన పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా పై చర్చించారు.

ఈ సందర్భంగా కమిషనర్ బి. నాగరాజు మాట్లాడుతూ.. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులకుగాను 35 పోలింగ్ స్టేషన్‌లు లు ఏర్పాటు చేసామ‌ని,ఒక వార్డులో 750 ఓట్లు కంటే పైబడి ఉంటే అదే వార్డుకు మరో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. అందులో భాగంగానే 750 పైబడి ఓటర్లు కు గాను అదే లొకేషన్‌లో అదనంగా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు.దీంతో 22 వార్డులకు గాను 35 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని, ఎటువంటి అభ్యంతరాలు ఉన్న రాజకీయ పార్టీల వారు తమ అభిప్రాయాలను వ్రాతపూర్వకంగా వెల్లడించాలని వివరించారు. స‌దురు అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం సరిచేసి పరిష్కరిస్తార‌ని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో అప్పారావు,టీపీఓ వి. శ్రీనివాస్,సీపీఐ(ఎం),సీపీఐ,భాజపా,బీఆర్ఎస్ నాయకులు
బి చిరంజీవి,విజయ్,మెట్ట వెంకటేష్, సత్యవరపు సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -