Wednesday, March 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి ఎకరానికి 30 వేల నష్టపరిహారం చెల్లించాలి

ప్రతి ఎకరానికి 30 వేల నష్టపరిహారం చెల్లించాలి

- Advertisement -
  • రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం

నవతెలంగాణ-మునుగోడు: రైతులు వేల రూపాయలు ఖర్చుపెట్టి సాగు చేసుకున్న వరి పంటకు అవసరమైన భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఎండిపోయిన ప్రతి ఎకరానికి 30 వేల నష్టపరిహారం చెల్లించాల‌ని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని కొరటికల్ గ్రామంలో ఎండిపోయిన వరి పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొరటికల్ గ్రామంలో వెయ్యి ఎకరాలలో వరి పంట సాగు చేయగా 2 వందల ఎకరాలకు పైచిలుకు వరి పంట పూర్తిగా ఎండిపోయిందని రైతులు తెలిపారు. యాసంగి సీజన్ లో వరి పంట సాగుచేసిన రైతులకు ఒకపక్క భూగర్భ జలాలు అడుగంటి పోవడం, మరోపక్క విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంట పొలాలన్నీ పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని బండ శ్రీశైలం అన్నారు. ఉన్న పంటల‌ను కాపాడుకునేందుకు నిరంత‌ర‌ విద్యుత్ సరఫరా చేయాలని స‌ర్కార్‌ను డిమాండ్ చేశారు. వరి పంట సాగు చేసి నష్టపోయిన రైతులను రెవిన్యూ వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలలో పంటల పరిశీలన చేసి ఎకరానికి 30 నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేను పక్షంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల్గా యాదయ్య, దొండ వెంకన్న, బోడిసె మహేందర్, జోలం రమేష్, జోలం రాములు, పాలంచి లక్ష్మియ్యా, ఎర్ర అయ్యన్న, బొల్లం శ్రీను తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -