Sunday, May 4, 2025
Homeతెలంగాణ రౌండప్ఎకరాకు రూ.50వేలు నష్టపరిహరం ఇవ్వాలి..

ఎకరాకు రూ.50వేలు నష్టపరిహరం ఇవ్వాలి..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: అకాల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.50వేల నష్టపరిహారాన్ని అందజేయాలని యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ శనివారం ఒకప్రకటనలో విజ్ఞప్తి  చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనేక కష్టాలను ఎదుర్కొంటూ పుట్టెడు పెట్టుబడులతో సాగు చేసిన పంటలు చేతికందే సమయంలో చేజారి పోతే ఎంత బాధ ఉంటుందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. ప్రతి ఏటా ఈ సీజన్‌లో అకాల వర్షాలు వస్తాయని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పదిహేను ఇరువై రోజుల క్రితం కేంద్రాలకు ధాన్యం తీసుకువస్తే మాయిశ్చర్‌ రాలేదంటూ కాంటాలు పెట్టకపోవడం మూలంగానే ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు.కొనుగోలు కేంద్రాల్లో తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేల చొప్పున ఇప్పించి ఆదుకోవాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -