నవతెలంగాణ- నవీపేట్: భారీ వర్షాలు, గోదావరి ముంపుకు గురై నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తహసిల్దార్ వెంకటరమణకు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎగువ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా గోదావరి పరివాహక గ్రామాలు నీటమునగడమే కాక సుమారు 6000 ఎకరాలలో పంట నీట మునిగిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయలు నీట మునిగిన గ్రామాల ప్రజలకు నిత్యవసర సరుకులతో పాటు ఇండ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ సింగ్, షేక్ మహబూబ్, పోగుల వసంత్, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.