Sunday, April 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిష్ణుప్రియపై సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

విష్ణుప్రియపై సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్రముఖ యాంకర్‌ విష్ణుప్రియ భీమినేని చుట్టూ ఇప్పుడు వివాదాల ముసురు ముదురుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఎక్స్‌క్లూజివ్‌ కంటెంట్‌ పేరుతో పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్లను ప్రోత్సహిస్తూ ఆమె చేస్తున్న ప్రచారంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రముఖ బుల్లితెర యాంకర్‌ విష్ణుప్రియ భీమినేని కొంతకాలంగా సోషల్‌ మీడియాలో తన గ్లామరస్‌ ఫొటోలు, వీడియోలతో సెన్సేషన్‌ సృ ష్టిస్తున్నారు. అయితే, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ”అర్ధనగ్న వీడియోలు చూడాలంటే నగదు చెల్లించి సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలి” అంటూ ఆమె చేస్తున్న ప్రచారం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న సబ్‌స్క్రిప్షన్‌ ఫీచర్‌ను ఆమె ఈ రకంగా వినియోగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బుల కోసం ఆమె ఇలాంటి వీడియోలను ప్రోత్సహించడం యువతను పెడదోవ పట్టించడమేనని పలువురు విమర్శిస్తున్నారు.

విష్ణుప్రియ తీరుపై ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (AISF) నాయకులు శనివారం విజయవాడ సూర్యారావుపేటలోని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్‌ నేతృత్వంలో ప్రతినిధి బృందం పోలీసులను కలిసి, ఆమెపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేసింది. కేవలం డబ్బు కోసం విష్ణుప్రియ ఇలాంటి ప్రచారాలకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో పేరున్న వ్యక్తులు ఇలాంటి పనులు చేయడం వల్ల తప్పుడు సందేశం వెళుతుందని వారు ఆరోపించారు. ఫిర్యాదులో భాగంగా నాయకులు మరికొన్ని కీలక డిమాండ్లు ఉంచారు. విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీని కేవలం వినోదం కోసం కాకుండా, అశ్లీలతను వ్యాపారం చేసే వేదికగా మార్చుకుందని వారు విమర్శించారు. వెంటనే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను బ్లాక్‌ చేయాలని, భవిష్యత్తులో మరెవరూ ఇలాంటి పనులకు సాహసించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు దీపక్‌, సిద్దు, మనోజ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గని తమ నిరసన వ్యక్తం చేశారు.

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సబ్‌స్క్రిప్షన్‌ మోడల్స్‌ అందుబాటులో ఉన్నప్పటికీ, వాటి ద్వారా ఎలాంటి కంటెంట్‌ పోస్ట్‌ చేయాలనే దానిపై కఠినమైన గైడ్‌లైన్స్‌ ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలోని సైబర్‌ చట్టాల ప్రకారం అశ్లీలతను ప్రోత్సహించడం నేరమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సెలబ్రిటీలు తమ హోదాను ఉపయోగించుకుని ఇలాంటి వివాదాస్పద మార్గాల్లో డబ్బు సంపాదించాలని చూడటం సరైన పద్ధతి కాదని నెటిజన్లు కూడా సోషల్‌ మీడియా వేదికగా కామెంట్స్‌ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -