నవతెలంగాణ – బల్మూరు
మండల కేంద్రంలోని పంచాయతీ కార్యదర్శి తనకు ఆస్తి నష్టం కలిగించాడని అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన చాంద్ పాషా సోమవారం జిల్లా కేంద్రంలో డిపిఓ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వివరాల ప్రకారం మండల కేంద్రంలో తన నివాసం పక్కలో ఉన్న మా సొంత ఇంటి స్థలంలో బేస్ మెంటు ఇసుక గనేటు రాళ్లను జెసిబితో తొలగించి పక్కనే బొందలో పడవేశారని వివరించాడు. గత ఎన్నో రోజులుగా ఫిర్యాదులు చేస్తున్న సంబంధిత కార్యదర్శి లక్ష్మణ్ పై చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ విషయమై డీపి ఉస్పందించి చర్యలు తీసుకునేందుకు ఆదేశించినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి లక్ష్మన్ మాట్లాడుతూ.. నీ సొంత జాగాకు సంబంధించి కాగితాలు పత్రాలు చూపించాలని నోటీసులు ఇచ్చినప్పటికీ సకాలంలో ఇవ్వనందుకే అక్కడ ఉన్న మెటీరియల్ ను తొలగించడం జరిగిందని తెలిపారు. గ్రామ పెద్దమనుషుల తీర్మానం మేరకే అక్కడ ఉన్న జాగాను ఖాళీ చేయించడం జరిగిందని తెలిపారు.
కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



