Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి 

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి 

- Advertisement -

– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 
నవతెలంగాణ –  కామారెడ్డి :  ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.  సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 46 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులనుండి వివిధ సమస్యలపై జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ నాయక్ తో కలిసి  జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో  కామారెడ్డి ఆర్డీఓ వీణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -