నవతెలంగాణ – దుబ్బాక
ప్రకృతి సహజసిద్ధంగా పండే కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలతో వండిన ఆహార పదార్థాలను తినడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, వీటిలోనే అన్ని రకాల పోషకాలు లభిస్తాయని పిరమిడ్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు, ధ్యాన గద్దర్ భూపతి రాజు అన్నారు. దుబ్బాక పట్టణ కేంద్రంలోని ‘శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం’ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం పిరమిడ్ కేంద్ర నిర్వాహకులు అంబటి కమల సాయిబాబా దంపతులు, మాస్టర్లు ఆకుల శ్రీనివాస్, బాలయ్య, పలువురుతో కలిసి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనేక రోగాలకు మూలమైన మాంసాహారాన్ని వెంటనే త్యజించాలన్నారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేందుకు ప్రతి ఒక్కరు ధ్యానం చేయడం అలవర్చుకోవాలని, సాత్విక ఆహారమైన శాకాహారాన్ని ప్రతినిత్యం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పిరమిడ్ ధ్యాన సాధకులు పాల్గొన్నారు.
శాకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం: భూపతి రాజు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES