Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సిలబస్ పూర్తి  చేసి ప్రాక్టికల్స్ కు సిద్ధం చేయండి

సిలబస్ పూర్తి  చేసి ప్రాక్టికల్స్ కు సిద్ధం చేయండి

- Advertisement -

ప్రిన్సిపల్స్ సమావేశంలో జిల్లా ఇంటర్ విద్య అధికారి
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 

ఇంటర్ విద్యార్థులకు  నవంబర్  నెలలో సిలబస్ పూర్తి చేసి ప్రాక్టికల్స్ కు విద్యార్థులను సిద్ధం చేయాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపూడి రవి కుమార్ ప్రిన్సిపాల్ లను ఆదేశించారు. బుధవారం నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్య అధికారి కార్యాలయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ ల సమావేషo జిల్లా ఇంటర్ విద్య అధికారి కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో మరమ్మత్తుల కోసం ఇంటర్ విద్యా బోర్డు కేటాయించిన నిధులను వినియోగించుకొని సివిల్, ఎలక్ట్రికల్, ఫర్నిచర్ ఇతర అన్ని మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు.

అలాగే ప్రయోగశాలలకు కేటాయించిన నిధులను వినియోగించుకొని వెంటనే ప్రాక్టికల్స్ కు అవసరమైన మెటీరియల్ ఇతర సామాగ్రిని సమకూర్చుకోవాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి ఆదేశించారు. అలాగే ఇంటర్ బోర్డ్ కేటాయించిన నిధులను వినియోగించుకున్నట్టుగా సర్టిఫికెట్లను డీ.ఐ.ఈ.ఓ. కార్యాలయంలో అందజేయాలని ఆదేశించారు. ఇంకా విద్యార్థుల యుడైస్, అపార్ పనులు పూర్తికాని కళాశాలలో వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ద్వారా అటెండెన్స్ కు పూర్తి స్థాయిలో విద్యార్థులు హాజరయ్యేట్టుగా ప్రిన్సిపాల్ లు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి అన్నారు. త్వరలో ఇంటర్ విద్యార్థులకు పరీక్ష ఫీజులు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు తేదీలను ప్రకటిస్తుందని కావున భవిష్యత్తులో విద్యార్థులను చదువుపై శ్రద్ధ వహించేలా ప్రిన్సిపాల్  లు కృషి చేయాలని అన్నారు.

  గత సంవత్సరం నిర్వహించిన 90 రోజుల ప్రణాళికను ఈసారి కూడా అమలు చేసే అవకాశం ఉందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలియజేశారు. ఇక ముందు అధ్యాపకులు హెచ్.ఆర్.ఎం.ఎస్. పోర్టల్ ద్వారానే సెలవుల కోసం అనుమతి పొంది వినియోగించుకోవలసి ఉంటుందని, ప్రతి అధ్యాపకులు సిబ్బంది ఈ పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని అన్నారు.  అలాగే టీచింగ్ డైరీలను కూడా ఆన్లైన్లోనే పూర్తి చేయాల్సి ఉంటుందని తెలియజేశారు.  కళాశాలలలో ఫర్నిచర్ ను కూడా మరమ్మతులు చేయించి ఇంకా విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన డెస్క్ బెంచిలను సమకూర్చుకునేందుకు వెంటనే ప్రతిపాదనలను పంపాలని అన్నారు. సమావేశంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -