– కేక్ కట్ చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
నవతెలంగాణ-వర్ధన్నపేట : వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులుగా కెఆర్ నాగరాజు గెలిచి ప్రమాణ స్వీకారం చేసి నేటికీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. స్థానిక సర్పంచ్ ఎన్నికల ప్రచార సభలో వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం ఇల్లంద గ్రామంలోనే ఎమ్మెల్యే ప్రచార సభ ప్రారంభించామని నేటికీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇల్లందులో సర్పంచ్ అభ్యర్థి ఎద్దు సత్యనారాయణ గెలుపు కోసం ప్రచార సభలో మళ్లీ ప్రజల మీ అందరి అభిమానంతో తాను రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ప్రజలు అభివృద్ధి చెందుతారన్నారు మరో 10 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి సర్కారు ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి ఎద్దు సత్యనారాయణ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అయూబ్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బొంపెల్లి దేవేందర్ రావు , జిల్లా మైనారిటీ నాయకులు ఎండి చోటు, ఐనవోలు దేవస్థానం కమిటీ చైర్మన్ కమ్మగొని ప్రభాకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎన్నికల ఇంచార్జ్ పత్రి భాను ప్రసాద్, జిల్లా నాయకులు శ్రీపాద సతీష్, స్థానిక పార్టీ అధ్యక్షులు ఎద్దు రాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల జిల్లా నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు పాల్గొన్నారు




