-కమ్యూనిటీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ప్రారంభం..
-సౌత్, వెస్ట్ జోన్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ ఎస్ సునీత
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
భార్యాభర్తలు తగాదా పడి వచ్చినప్పుడు వారికి సర్ది చెప్పి రాజీ కుదర్చడమే ప్రథమ కర్తవ్యంగా కృషి చేస్తున్నామని సౌత్, వెస్ట్ జోన్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ ఎస్ సునీత అన్నారు. మంగళవారం షాయినాథ్ గంజ్ లోని సౌత్ వెస్ట్ జోన్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ… ఇటీవల మెస్కో ఎడ్యుకేషనల్ హాల్ లో కమ్యూనిటీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున దంపతులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారని తెలిపారు. భార్యాభర్తలు కుటుంబంలో విభేదాలు వస్తే కమ్యూనిటీ లోని పెద్దల సమక్షంలో సమస్యలు వివరించి కమ్యూనిటీ స్థాయిలోనే పరిష్కరించుకున్నట్లయితే భార్యాభర్తల బంధం బలపడుతుంది అన్నారు.
భార్య భర్తల గొడవల వల్ల పిల్లలపై చెడు ప్రభావం పడే ప్రమాదం పొంచి ఉందన్నారు. కుటుంబ సభ్యుల మధ్య కమ్యూనికేషన్ మెరుగుపరచడం కమ్యూనిటీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా దంపతుల సమస్యలు పరిష్కారమైతాయి అన్నారు. భార్యాభర్తల బంధం ప్రేమ నమ్మకం పరస్పర గౌరవం పై ఆధారపడి ఉంటుందని తెలిపారు. బంధాలు దృఢంగా ఉండడానికి మంచి అనుబంధం ద్వారా ఒకరినొకరు అండగా నిలబడడం చాలా ముఖ్యమన్నారు. దంపతులు ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకుంటూ బలమైన వైవాహిక బంధం కొనసాగిస్తూ ముందుకు సాగాలని సూచించారు. చిన్నచిన్న విషయాలకే తగాదాలకు పోకుండా సామరస్యంతో పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ లు అనిత, శివ కుమారి, భరోసా కౌన్సిలర్ లు ఉషా సుజాత, ఇందిరా, ఈతియజ్, పెద్ద ఎత్తున దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
దంపతుల సమస్యలకు రాజీ మార్గమే పరిష్కారం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES