Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఅమెరికా, జీ-7 యుద్ధోన్మాదాన్ని ఖండించండి

అమెరికా, జీ-7 యుద్ధోన్మాదాన్ని ఖండించండి

- Advertisement -

– సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్‌
న్యూఢిల్లీ:
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేస్తున్న యుద్ధోన్మాద ప్రకటనలను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఉద్రిక్తతలు మరింత పెచ్చరిల్లుతా యని, మొత్తంగా పశ్చిమాసియా ప్రాంతాన్ని యుద్ధం, అస్థిరతల వైపు నెడతాయని హెచ్చరించింది. ఇరాన్‌ నేతలను హత మారుస్తామంటూ అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పుడు బహిరం గంగానే హెచ్చరించడం, పైగా ఇరాన్‌ బేషరతుగా లొంగిపోవాలని డిమాండ్‌ చేయడం తీవ్రంగా విచారిం చదగ్గ అంశమని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన జారీచేసింది. పశ్చిమాసి యాలో అమెరికా మిలటరీ బలగాలను పెద్ద ఎత్తున సమీకరించడం చూస్తుంటే ఇరాన్‌పై దాడులు చేసేందుకై ఇజ్రాయిల్‌తో చేతులు కలపడానికి అమెరికా సిద్ధంగా వుందనే సంకే తాలు వెలువడుతున్నాయని పేర్కొంది. ఈ పరిణామాలు చాలా ప్రమాదకరమని, ఈ ప్రాంతాన్ని, ప్రపంచాన్ని వినాశకరమైన యుద్ధం అంచుకు నెట్టే ప్రమాదం వుందని పేర్కొంది. కెనడాలో జరిగిన జీ-7 సమావేశం చేసిన తాజా ప్రకటన ఈ యుద్ధోన్మాదాన్ని మరింత రెచ్చ గొడుతోంది. ఇజ్రాయిల్‌ పాల్పడుతున్న దూకుడు, దురాక్రమణ చర్యలను పూర్తిగా విస్మరిస్తూ, మరోవైపు ఇరాన్‌ను మాత్రం జీ-7 నిందించడం పూర్తిగా ఖండించదగిన అంశం. ఉద్రిక్తతలు పెచ్చరిల్లడానికి, పశ్చిమాసియా లో కొనసాగుతున్న అస్థిరతకు ప్రాధమిక బాధ్యత ఇజ్రాయిల్‌దేనని స్పష్టమవు తోంది. గాజాలో మారణకాండను కొనసాగిస్తున్న ఇజ్రాయిల్‌ ఉద్దేశ్య పూర్వకంగానే సిరియా, లెబనాన్‌, యెమెన్‌, ఇప్పుడు ఇరాన్‌ సహా ఈ ప్రాంతంలోని ఇతర దేశాలకు కూడా సైనిక చర్యలను విస్తరిస్తూ వస్తోంది. ఇజ్రాయిల్‌ను నియంత్రించకుండా, ఈ ప్రాంతంలో శాంతి సుస్థితరలు అగమ్యగోచరమే అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలను దారుణంగా ఉల్లంఘిస్తూ పశ్చిమాసియాపై, ఇతర ప్రాంతాలపై తమ గుత్తాధిపత్యాన్ని అమలు చేసేందుకు అమెరికా, పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదం దుష్ట దేశమైన ఇజ్రాయిల్‌ను ఉపయోగించుకుంటున్నాయి. తమ దూకుడు చర్యలను తక్షణమే విరమించి, దౌత్య పంథాకు మళ్ళేలా అమెరికా, ఇజ్రాయిల్‌పై అత్యవసరంగా ఒత్తిడి తీసుకువచ్చేలా అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన అమెరికా అనుకూల, ఇజ్రాయిల్‌ అనుకూల విదేశాంగ విధానాన్ని విడనాడాలి. ఇజ్రాయిల్‌ దాని ప్రధాన మద్దతుదారు అమెరికా దురాక్రమణ చర్యలకు తక్షణమే స్వస్తి పలకాలని ఇతర దేశాలన్నీ సమిష్టిగా డిమాండ్‌ చేయాలి. గ్లోబల్‌ సౌత్‌ పట్ల నిజమైన నిబద్ధత గనక వుంటే ఇతర దేశాలతో సంఘీభావం అవసరం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad