సామినేని రామారావును హత్యచేసిన
వారిని కఠినంగా శిక్షించాలి : ఏఐఏడబ్ల్యూయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హత్య రాజకీయాలతో ప్రజా ఉద్యమాలను అడ్డుకోలేరనీ, రైతు సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి సామినేని రామారావు హత్య ఆందోళన కలిగించేలా ఉందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్.వెంకట్రా ములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్ పేర్కొన్నారు. రామారావును హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన మృతికి సంతాపం, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనేక ప్రజా ఉద్యమాలకు రైతాంగ ఉద్యమాలకు నాయకత్వం వహించిన రామారావును ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామాల్లో కాంగ్రెస్ మూకల కిరాయి గుండాలు అత్యంత కిరాతకంగా చంపడాన్ని ఖండించారు. సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శిగా, పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీ సభ్యులుగా, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారని గుర్తుచేశారు. రామారావు ఆ గ్రామంలో రెండుసార్లు సర్పంచిగా పనిచేశారనీ, సీపీఐ(ఎం)ను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ మూకలు కిరాయి గుండాలతో చంపించడం దుర్మార్గమని పేర్కొన్నారు. రామారావు మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని పేర్కొన్నారు.
హత్యా రాజకీయాలను ఖండించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



