- Advertisement -
- కలెక్టర్ కు విన్నవించిన ఆవాజ్ నాయకులు
నవతెలంగాణ-వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని పానగల్ రోడ్డులో ఉన్న అక్షర కాన్సెప్ట్ స్కూల్లో ఇటీవల చోటుచేసుకున్న అత్యాచార ఘటనపై సమగ్ర విచారణ చేయించాలని ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జబ్బార్ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిను కోరారు. ఆవాజ్ రాష్ట్ర, జిల్లా కమిటీల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అత్యాచార ఘటనపై స్కూల్ యాజమాన్యం తీరుపై కలెక్టర్ కు వివరించారు. అభి అనే యువకుడు మైనార్టీ తీరకముందే పాఠశాలలో వార్డెన్ గా ఎలా పనిచేస్తాడని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.
అలాగే అభి అనే యువకుడికి పాఠశాలలోనే రెండు రకాల బోనం ఫైట్స్ ఉన్నాయని చెప్పారు. అలాంటి వ్యక్తి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాక మూడు రోజులపాటు ఘటనను బయటకి రానివ్వకుండా దాచిపెట్టి యాజమాన్యం తప్పు చేసిందని తెలిపారు. కాబట్టి అక్షర కాన్సెప్ట్ స్కూల్ గుర్తింపును రద్దు చేస్తూ, ఘటనపై పూర్తి విచారణ చేయించాలని కోరారు. అలాగే బాధితురాలు అయినా చిన్నారి చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు. కండక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన వారిలో ఆవాజ్ జిల్లా అధ్యక్షుడు ఎం.డి మునిరోద్దీన్, మైనార్టీ పెద్దలు వారి మౌలానా, మత పెద్దలు ఉన్నారు.
- Advertisement -



